Justice Sudarshan Reddy on Vice President Elections : రాజకీయ ప్రమేయం లేని వ్యక్తి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తే ప్రయోజనకరమని ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది తన సుదీర్ఘ ప్రయాణానికి కొనసాగింపు అని ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగ ప్రక్రియతో పెనవేసుకున్న పదవి అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఉన్నతస్థాయి వ్యక్తులు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారని చెప్పారు. ఉపరాష్ట్రపతి పదవిని రాజకీయపర పదవిగా చూడటం లేదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది రాజకీయ పార్టీలు కాదని ఉద్ఘాటించారు. పార్లమెంటు సభ్యులు విచక్షణను ఉపయోగించి ఓటు వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీ పక్షానికి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రమేయం లేని వ్యక్తి ఉపరాష్ట్రపతి అయితే దేశానికి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం అని ఆయన వెల్లడించారు. ఉపరాష్ట్రపతిని పార్టీలు ఎన్నుకోవని పార్లమెంటు సభ్యులు విచక్షణా అధికారంతో ఓటువేసి ఎన్నుకుంటారంటున్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో ఈటీవీ భారత్‌తో ముఖాముఖి.
Be the first to comment