Skip to playerSkip to main content
  • 7 months ago
UPSC Ranker Keerthi Reddy From Kadapa : సివిల్స్‌ సాధించాలనేది ఆ యువతి కల. ఐతే ఒక ట్రెండుసార్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే ఇక ఆపేద్దాం అనుకుంటాం. అలాంటిది ఐదుసార్లు సివిల్స్‌లో విఫలమైనా ఆరో ప్రయత్నంలో 316వ ర్యాంకు సాధించి కడపకు చెందిన కీర్తిరెడ్డి. యూపీఎస్సీ సిలబస్ చదవడమే కాకుండా పత్రికలు నిత్యం చదవడం అలవాటు చేసుకోవడం కూడా సివిల్స్ సాధించడానికి కారణమైందని అంటున్నారు. బిట్స్ బిలానీలో ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత చాలా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వదులుకొని పబ్లిక్ సర్వెంట్​గా దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్ వైపు అడుగులు వేశానని చెబుతున్నారు. ఈ ర్యాంకు కోసం తానెంతో కృషి చేశానని, లక్ష్య సాధనలో మీపై మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించొచ్చని అంటున్నారు కీర్తి. ఎప్పుడైతే కష్ట పడటంతో పాటు సానుకూల దృక్పథంతో నన్ను నేను నమ్మి పరీక్షలు రాశానో అప్పుడే మంచి విజయం సాధించానని చెప్తున్నారు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సహంతో గతంలో జరిగిన పొరబాట్లను సరిదిద్ధుకుని విజయం సాధించానంటున్న కీర్తిరెడ్డితో చిట్‌చాట్‌.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended