Skip to playerSkip to main content
  • 8 years ago
Former India captain MS Dhoni, who holds an honorary rank of Lieutenant Colonel in the Army, interacted with budding cricketers in the Uri town of north Kashmir's Baramulla district and emphasised on the need to focus on fitness.

కశ్మీర్‌ బరాముల్లా జిల్లాలోని కంజెర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన చినార్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధోనిని భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌పై ప్రశ్నించగా, భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే అది దౌత్యపరంగా, రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కాబట్టి ప్రభుత్వానికే ఈ విషయాన్ని వదిలేయాలని ధోని చెప్పుకొచ్చాడు. ఈ క్రికెట్ మ్యాచ్‌కి ధోని లెప్టెనెంట్ కల్నల్ హోదాలో హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలువురు ధోనితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
ఇక ఇటీవలికాలంలో క్రికెట్‌ ఆడటం బాగా ఎక్కువైపోయిందని ధోని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా వంటి విదేశీ సిరీస్‌లు ఆడాలంటే ఆటగాళ్లకు తగినంత సమయం కావాలని సూచించాడు.
'కోహ్లీ వ్యాఖ్యలు నూటికి నూరుశాతం సరైనవే. మేం విపరీతంగా క్రికెట్‌ ఆడుతున్నాం. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాకు తగినంత సమయం శిక్షణ కోసం దొరకడం లేదు. ప్రస్తుత జట్టులో చాలామందికి విదేశాల్లో ఆడిన అనుభవం ఉంది. వీరికి కనీసం ఆరు నుంచి పది రోజులు సమయం దొరికినా.. కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారు. కానీ, ఒక అంతర్జాతీయ క్రికెటర్‌గా ఈ సవాల్‌ను ఎదుర్కోవాల్సిందే' అని ధోని అన్నాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended