Skip to playerSkip to main content
  • 8 years ago
The Income Tax department has raided the Poes Garden House of the former Tamil Nadu Chief Minister Late Jaya Lalitha. The IT officials are said to have seized a laptop, a desktop and few pen drive from the two rooms used by Jaya Lalitha’s close aide VK Sasi Kala.

నాటకీయ పరిణామాల నడుమ అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై ఇప్పటికీ తొలగిపోని అనుమానాలెన్నో. చివరి రోజుల్లో ఆమె వాస్తవ పరిస్థితి గురించి ఎరిగినవాళ్లలో శశికళ తప్ప మరొకరు లేరు.
నిజానికి జయలలిత అంతరంగీక జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలు చాలానే ఉన్నాయంటారు. అవేవి ఇప్పటికైతే బయటపడలేదు. కనీసం ఆమె చివరి రోజుల్లో ఎలా ఉన్నారన్న దానికి సంబంధించి ఫోటోలు గానీ వీడియోలు గానీ బయటకు రాలేదు. అయితే వేద నిలయంలో తాజాగా ఐటీ అధికారులు చేసిన దాడుల్లో జయలలిత చివరి రోజుల్లోని వీడియో క్లిప్పింగ్స్ ఉన్నపెన్ డ్రైవ్ ఒకటి దొరికందట.
వేదనిలయం తనిఖీల్లో భాగంగా జయలలిత వ్యక్తిగత సహాయకుడు పూంగుండ్రన్, నెచ్చెలి శశికళ గదుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులకు ఒక పెన్‌డ్రైవ్ లభ్యమైనట్టు తెలుస్తోంది. పెన్‌డ్రైవ్‌లో జయను ఆస్పత్రికి తరలించే గంటముందు నమోదైన సీసీటీవీ దృశ్యాలు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended