Skip to playerSkip to main content
  • 8 years ago
Former India coach Anil Kumble is in the running for the Coach of the Year award in the inaugural edition of the Indian Sports Honours, instituted by the RP-SG Group in association with the foundation of skipper Virat Kohli.
టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే 'కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌' రేసులో ఉన్నారు. భారత్‌లోని స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌ని గౌరవించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సారి ఆర్పీ-ఎస్‌జీ గ్రూపు, విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌ కలిసి సంయుక్తంగా ఈ అవార్డుని అందజేయనున్నాయి. నవంబర్ 11న ముంబైలో విజేతలను ప్రకటించిన అవార్డులను అందజేయనున్నారు. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌, టెన్నిస్‌ క్రీడాకారుడు మహేశ్‌ భూపతి, పీటీ ఉష, షూటర్‌ అంజలి భగతవత్‌, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్‌ హాలప్పల జ్యూరీ బృందం విజేతలను ఎంపిక చేయనుంది. మొత్తం 8 విభాగాల్లో అవార్డులను అందజేయనున్నారు. ఇందులో స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఉంది. ఈ అవార్డు కోసం క్రికెటర్లు పుజారా, అశ్విన్‌, హార్దిక్‌ పాండ్యా, దీప్తి శర్మ, మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఒలింపిక్‌ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్‌, కబడ్డీ ఆటగాడు పర్దీప్ నర్వాల్‌, ఫుట్‌బాల్‌ కెప్టెన్ సునీల్‌ చెత్రి, హాకీ స్టార్‌ రూపీందర్‌ పాల్‌ సింగ్‌ పోటీ పడుతున్నారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended