Skip to playerSkip to main content
  • 16 minutes ago
హైదరాబాద్​లోని మైలార్​దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాముకు సైతం వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముందుగా ప్లాస్టిక్​ గోదాంలో మంటలు చెలరేగి భారీగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు తెలిపారు. దీంతో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ (డీఆర్​ఎఫ్) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తొలుత గోదాముల్లో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్క గోదాములు, దుకాణాలకు వ్యాపించకుండా ఐదు ఫైరింజిన్లతో మంటలను ఆర్పారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ గోదాముల్లో రూ.లక్షల విలువైన వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదానికి షాట్​ సర్క్యూట్​ కారణమా లేక మరేదైనా తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:04Oh
00:32I don't know what to do.
01:01You

Recommended