Skip to playerSkip to main content
  • 8 minutes ago
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి కొండపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రహరీ దెబ్బతింది. వర్షపు నీరు నిలిచిపోవడం, పునాదులు నానడంతో సుమారు 12 అడుగుల మేర ప్రహరీ ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గోడ కూలిన ప్రదేశంలో భక్తులు ఎవరూ వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంపై ఆలయ ఈవో సునీల్ కుమార్ స్పందించారు. ఇదే తరహాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగితే ఇప్పటికే బలహీనపడిన ప్రహరీ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా, పాత గోడ మొత్తాన్ని పూర్తిగా తొలగించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఆ గోడను పడగొట్టి దాని స్థానంలో పటిష్టమైన నూతన ప్రహరీని నిర్మించే అవకాశం ఉందని ఈవో సునీల్ కుమార్ స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలో భారీ వర్షాలకు కొండ ప్రాంతం బాగా నానిపోవడంతో, పైనుంచి కొండచరియలు ఒక్కసారిగా ఇళ్లపైకి విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో షేక్ మీరాభి అనే మహిళ దుర్మరణం చెందింది.  

Category

🗞
News
Comments

Recommended