Skip to playerSkip to main content
  • 11 minutes ago
కుండపోత వానల ధాటికి తూర్పుగోదావరి జిల్లా సింగవరం వద్ద ఎర్రకాలువకు గండి పడింది. దీంతో కాలువ నీరు ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకురావడంతో వందలాది ఎకరాల్లో వరి పంటలు నీటమునిగాయి. ఇప్పటికే అకాల వర్షాలకు వరి చేలు కొంతమేర మునగగా, తాజా వరదతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నీటిలో నానుతున్న పంటను రక్షించుకునేందుకు రైతులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. చిన్న పడవల మాదిరిగా ఉన్న ప్లాస్టిక్ లేదా ఇనుప తొట్టిలను ఏర్పాటు చేసుకుని, వాటి సాయంతో నీరు నిలిచిన పొలాల్లోకి వెళుతున్నారు. కోసిన వరి పనలను ఆ తొట్టిల్లో నింపుకుని ఎంతో కష్టపడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చుకుంటున్నారు.  ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాలు, పలు గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా సింగవరం, తీరుగూడెం, తాళ్లపాలెం గ్రామాలకు వరద భయం పట్టుకుంది. అలాగే నిడదవోలు పట్టణంలోని పలు శివారు కాలనీలు సైతం ఏ క్షణమైనా నీట మునిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. గ్రామంలోని దేవాలయాల వద్ద ఉన్న మైకుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. 

Category

🗞
News
Transcript
00:03,
00:04I have a dance floor there.
00:10Now I'm going to go to the island.
00:11I'm going to go to the island.
00:12I'm going to go to the island.
00:13Can you see the other island?
00:19It's like this green...
00:23Do you know how to give this fish the fish?
00:26I'll try this again for hin-e-e-the fish for a little while
00:46Thank you very much.
01:36Thank you very much.
01:46Thank you very much.

Recommended