Man Died in Road Accident as Stray Dogs Chases his Bike in Annamayya District: వీధి కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా నడిపాడు. బైక్ అదుపుతప్పి ఆలయ గోడను ఢీకొట్టింది. వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయచోటి పట్టణంలోని లక్ష్మీపురానికి చెందిన ఫజిల్ తెల్లవారుజామున బైక్ పై ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద కుక్కలు వెంబడించాయి. వాటి బారి నుంచి తప్పించుకోవాలని ఫజిల్ బైక్‌ను అతి వేగంగా నడిపారు. బైక్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న ఆలయ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫజిల్ అక్కడికక్కడే మృతి చెందారు. రాయచోటి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్లపై ఆవులు, కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్న మున్సిపాలిటీ సిబ్బంది సరైన చర్యలు తీసుకోవడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.
Be the first to comment