Precautions to be Taken by Passengers while Traveling by Bus : ప్రస్తుత రోజుల్లో బస్సులో ప్రయాణమంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఏసీ స్లీపర్, సిట్టింగ్ బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామంది ప్రయాణికులకు తెలియదు. కనీసం అత్యవసర ద్వారం ఎలా తీయాలో అవగాహన ఉండదు. ఏసీ బస్సుల్లో ప్రతి ప్రయాణికుడి సీటు వద్ద సుత్తి ఉంటుంది. దాన్ని ఉపయోగించి అద్దాన్ని బద్దలు కొట్టి బయటకు రావచ్చు. కానీ అటు బస్సు సిబ్బంది, ప్రయాణికులు గానీ అలా చేయకపోవటంతో కర్నూలు జిల్లాలో భారీ ప్రాణనష్టం జరిగింది. ప్రైవేటు, ప్రభుత్వ ట్రావెల్ బస్సులో ప్రయాణించేటప్పుడు అనుకోని ప్రమాదం ఏర్పడితే అక్కడి నుంచి ఎలా బయటపడాలో, బస్సులో ఎక్కడ ఏ ప్రాంతంలో సేప్టీ పరికరాలు ఉంటాయో మా ప్రతినిధి కృష్ణమ నాయుడు అందిస్తారు.
Be the first to comment