Road Accident Happened On The Kathipudi National Highway : కాకినాడ జిల్లాలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో వెళుతున్న ఓ కంటైనర్ కత్తిపూడి జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న క్రమంలో కోల్‌కతా నుంచి చెన్నై కాటన్ వేస్ట్ బండిల్స్ లోడుతో వస్తున్న మరో కంటైనర్ ఢీకొంది. వెంటనే మంటలు చెలరేగి రెండు కంటైనర్ల ముందు భాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో కాటన్ లారీ డ్రైవర్ కమల్ షేక్ (43) సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సజీవ దహనమైన డ్రైవర్ కోల్‌కతాకు చెందిన వ్యక్తి అని ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపారు. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments