MLC Teenmar Mallanna Press Meet : కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని, ఈడబ్ల్యూఎస్ రక్షించుకోవడానికే కుట్ర పన్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. కాంగ్రెస్‌లో ఉంటే ప్రశ్నిస్తున్నాననే సస్పెండ్ చేశారని అన్నారు. తనను బహిష్కరించినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడారు.
బీసీ కులగణన తప్పని ప్రతులను కాల్చడం తప్పానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేను కేటీఆర్ పకడ్బందీగా చేశారన్నారు. కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని ఆరోపించారు. బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రక్షించుకోవడానికే కుట్ర పన్నారన్నారు. సర్వేకు బాధ్యత నాది అని సీఎం ఒప్పుకుంటారానని ప్రశ్నించారు. సర్వే తప్పని నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి బ్రదర్స్ అనేక విమర్శలు చేశారని గుర్తు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఒక న్యాయం, నాకొక న్యాయమా అంటూ ప్రశ్నించారు. అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకే ఉంటుందా, బీసీలకు ఉండదానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అడిగారు.
Be the first to comment