Medaram Sammakka Saralamma New Gaddelu : మేడారంలో నూతనంగా నిర్మించిన అమ్మవారి గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పాలు కొత్త రూపాన్ని అందించాయి. సుమారు 4 వేల టన్నుల గ్రానైట్‌పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసేలా 7 వేల చిత్రాలను హృద్యంగా చిత్రీకరించారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా మూడు నెలల వ్యవధిలోనే పనులను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ నిర్మాణ పనులు ఆదివాసీల మూలాలు జాతర చరిత్రను కళ్లకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతున్న మేడారం డ్రోన్ దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 28 నుంచి మేడారం జాతర 4 రోజుల పాటు అట్టహాసంగా సాగనుంది.
Be the first to comment