Theft in Medak Distrct : మెదక్ జిల్లా రామాయంపేటలో ఓ వృద్ధురాలికి మద్యం తాగించి బంగారు, వెండి ఆభరణాలను కాజేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రామాయంపేట సర్కిల్ పోలీసు స్టేషన్లో సీఐ వెంకట్ రాజు గౌడ్ మీడియా సమావేశంలో నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించారు. గత నెల (నవంబర్) 30వ తేదిన చెల్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల నర్సవ్వ అనే వృద్ధురాలుకి మాయ మాటలు చెప్పి మద్యం తాగించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలతో పాటు రూ.30 వేల నగదును ఇద్దరు దంపతులు దొంగిలించారు.
Be the first to comment