The Ground Breaker Book was Launched by TiE Co Founder Dr.Kanwal Rekhi : భారత్ ఆర్థికంగా బలంగా తయారవుతోందని TiE (టై) కో ఫౌండర్ డాక్టర్ కణ్వాల్ రేఖీ అన్నారు. తన జీవితంలోని వివిధ దశలకు సంబంధించి తాను రాసిన పుస్తకం ది గ్రౌండ్ బ్రేకర్ (The Ground Breaker)ను ఈరోజు హైదరాబాద్ సత్వా నాలెడ్జ్ సిటీలో ఆవిష్కరించారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలని, అప్పుడు భారత్ మరింత గొప్పగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మూడు దశాబ్ధాల్లో గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. స్వాతంత్య్రం కంటే ముందు పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జన్మించిన డాక్టర్ కణ్వాల్ రేఖీ సిలికాన్ వ్యాలీలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళీ కక్కర్ల అన్నారు. భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, నిపుణులైన మానవ వనరులకు, ప్రభుత్వ సహకారం, విధి విధానాలు తోడైతే రాబోయే రోజుల్లో స్టార్టప్‌లో భారత్ ఎంతో ముందుంటుందని కణ్వాల్ రేఖీ తెలిపారు.
Be the first to comment