Simple Wedding Of IAS IPS Officers In Choutuppal : చాలా మంది యువత పెళ్లంటే భయపడుతుంటారు. సుమారు 30 ఏళ్లు దాటనిదే వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ధనవంతులు వివాహాలు చేసుకునే సందర్భాల్లో రూ. కోట్లలో ఖర్చులు చేస్తూ ఉంటారు. కాగా వీటన్నింటికీ భిన్నంగా యాదాద్రి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారు. కుటుంబసభ్యులు, ఉన్నతాధికారుల సమక్షంలో చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎలాంటి ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్న ఈ కొత్త జంటకు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments