Telangana tends to climb with the rising temperatures of the day.The maximum temperature was recorded at 45.3 degrees Celsius, with maximum temperature of 32.5 degrees Celsius. #telangana #temperature #districts #sun #public #problems #Adilabad #marriages
ఓ పక్క తుపాను అంటూనే మరో పక్క ఎండలు మండిపోతున్నయి. ఎండ తీవ్రతకు తెలంగాణలోని జిల్లాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ అగ్నిగుండాన్ని తలపిస్తుంది. ఆదివారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరకుంటుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 35 డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా వేడిగాలుల ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతుండడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు.
Be the first to comment