Skip to playerSkip to main content
  • 8 years ago
Delhi Daredevils have a new captain in Shreyas Iyer after Gautam Gambhir stepped down following his team's poor outings this IPL season so far. Their first match under new captain is at Ferozeshah Kotla, their home venue, against Kolkata Knight Riders on Friday (April 27).

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించి రెండు సార్లు ట్రోఫీని గెలిచిన గౌతం గంభీర్ జట్టుని వదిలి ఢిల్లీ జట్టుకు చేరాడు. ఐపీఎల్ అభిమానులంతా గంభీర్ విజయం వైపు నడిపిస్తాడు అని ఆశపడి ఎదురుచూసిన వారందరికీ.. నిరుత్సాహమే మిగిలింది. ఆ జట్టు చివరిగా ఆడినా నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఘోర పరాజయాల్ని చవిచూసి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది.
వరుస ఓటములకి బాధ్యత వహిస్తూ బుధవారం జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ తప్పుకోగా.. యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కి నాయకత్వ బాధ్యతలను ఢిల్లీ ఫ్రాంఛైజీ అప్పగించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకి కోల్‌కతాతో సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో ఢిల్లీ మ్యాచ్ ఆడనుంది.
ఇప్పటికే మూడు జట్లు పది పాయింట్లతో ప్లేఆఫ్‌కి చేరువవుతుండగా.. ప్రస్తుతం ఒక విజయంతో రెండు పాయింట్లతో ఉన్న ఢిల్లీ జట్టు ప్లేఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే.. ప్రతి మ్యాచ్‌లో సత్తాచాటాల్సిన సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్ మినహా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో నిరాశపరుస్తున్న ఢిల్లీ జట్టు.. మళ్లీ సొంతగడ్డపై విజయంతో పుంజుకోవాలని ఆశిస్తోంది.
#Delhi Daredevils
#Shreyas Iyer
#Gautam Gambhir
#Kolkata Knight Riders

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended