Director RGV Made a sensational statement that he only suggested to Sri Reddy to scold Pawan Kalyan by using a abusive word
బూతు పదం ఉపయోగించి పవన్ కల్యాణ్ ను తిట్టమని శ్రీరెడ్డికి సలహా ఇచ్చింది తానే అని బాంబు పేల్చారు రాంగోపాల్ వర్మ. అంతేకాదు నిర్మాత సురేశ్ బాబు కుమారుడు అభిరామ్ చేసిన పనికి రూ.5కోట్ల సెటిల్మెంట్ ఆఫర్ చేస్తే శ్రీరెడ్డి తిరస్కరించిందని మరో సంచలన విషయం చెప్పారు.
శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేసిన తర్వాత ఆమె పోరాటాన్ని తాను మరింత సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టానన్నారు ఆర్జీవి. రెండు రోజులు ప్రయత్నించి ఆమె నంబర్ సంపాదించినట్టు తెలిపారు. ఆ సందర్భంగా ఆమెకో డీల్ ఆఫర్ చేశానని చెప్పారు.
రూ.5కోట్లు తీసుకుని.. సురేశ్ బాబు ఫ్యామిలీతో రాజీకి రావాలని శ్రీరెడ్డికి సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చానని ఆర్జీవి తెలిపారు. అయితే శ్రీరెడ్డి మాత్రం ఆ ఆఫర్ ను తిరస్కరించిందని.. అది తనకు బిగ్ షాక్ అని చెప్పారు.
ఇప్పుడు మీ దగ్గర డబ్బు తీసుకుంటే.. రేప్పొద్దున నా ముఖాన్ని నేనే అద్దంలో చూసుకోలేనని చెప్పింది. ఈ పోరాటం ఎంతోమంది అమాయక ఆడపిల్లలకు ఉపయోగపడుతుందని, కాబట్టి దాన్ని తాకట్టు పెట్టే రీతిలో తాను వ్యవహరించదలుచుకోలేదని ఆమె పేర్కొన్నట్టు ఆర్జీవి వెల్లడించారు. శ్రీరెడ్డి సమాధానంతో ఆమెపై మరింత గౌరవం పెరిగిందన్నారు. అయితే తాను డబ్బులు ఆఫర్ చేసిన విషయం సురేశ్ బాబుకు తెలియదని, ఆయన చట్టపరంగానే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇక పవన్ కల్యాణ్ ను ఆ బూతు పదం ఉపయోగించి తిట్టాలని సలహా ఇచ్చింది కూడా తానే అని వెల్లడించారు రాంగోపాల్ వర్మ. అందుకే దానిపై శ్రీరెడ్డి ఎవరికీ సరైన వివరణ ఇవ్వలేకపోతుందన్నారు. ఆమెను ప్రభావితం చేసిన వ్యక్తిగా దానికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నానని అన్నారు. ఈ చర్య వల్ల ఎవరైనా బాధపడి ఉంటే.. పవన్ కల్యాణ్ తో సహా వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ పదాన్ని ఉపయోగించమని చెప్పడంలో ఉద్దేశం.. అదొక తీవ్ర స్థాయి ఎక్స్-ప్రెషన్ అని అన్నారు

Category
🗞
News