Skip to playerSkip to main content
  • 6 minutes ago
Impact of Cyclone Murasu in Mangalagiri : అర్నబ్‌ తుపాను విధ్వంసానికి వారం గడవక ముందే మరో ముప్పు మురసు రూపంలో ముంచుకొచ్చింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. తీరాన్ని దాటిన తుపాను ఈదురుగాలులు, జోరువానతో తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. గాలిదుమారానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగపడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచి అధకారం ఏర్పడింది. 'మురసు' తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై మోకాల్లోతు నీరు చేరింది. మంత్రి లోకేశ్ ఆదేశాలతో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో ఉంటున్న వారిని అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Category

🗞
News
Transcript
00:28Transcription by CastingWords
00:35CastingWords
01:15CastingWords
01:30CastingWords

Recommended