Cyclone Arnab Devastates Uppada Beach : రాష్ట్రంలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో తీరం కోతకు గురైంది. కట్ట తెగిపోయింది. రాళ్లు, మట్టి జారిపడి నామరూపాల్లేకుండా పోయింది. ఇదీ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో అర్నబ్ తుపాను సృష్టించిన అరవీర భయంకర విధ్వంసం. రాకాసి అలల ధాటికి ఉప్పాడ తీరం కకావికలమైంది. యు.కొత్తపల్లి మండల పరిధిలోని తీర ప్రాంతంపై అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల ఎత్తుగా నిర్మించిన రాళ్లగట్టును సైతం దాటుకుని సముద్ర కెరటాలు తీరంపై విరుచుకుపడ్డాయి. దీంతో తీరం కోతకు గురై రాళ్లు, మట్టి కొట్టుకుపోయాయి. అంతేకాదు కొత్తపట్నం, కొత్తపేట, పల్లిలపేట, సుబ్బంపేట, రంగంపేట మీదుగా ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని ఈ డ్రోన్ దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. ఈ దృశ్యాల్లో సముద్రపు అలల ఉద్ధృతి, దెబ్బతిన్న రహదారి, కోతకు గురైన తీరం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Comments