Skip to playerSkip to main content
  • 4 minutes ago
Gosthani Impact Penumantra : తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పొటెత్తుతున్న వరదతో పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని గోస్తాని డ్రైన్‌ ఉగ్రరూపం దాల్చింది. పేరుకుపోయిన వ్యర్థాలు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో ఎనిమిది గ్రామాల్లోకి నీరు చేరింది. ఈ క్రమంలో త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన నత్త రామేశ్వరంలోని శ్రీ రామేశ్వరస్వామి వారి దేవస్థానం నీట మునిగింది. గత మూడు రోజులుగా ఆలయం ఆవరణలోకి భారీగా నీరు చేరింది. దీంతో భక్తులు గుడిలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అర్చకులు మాత్రమే లోపలికి వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించి వస్తున్నారు.మరోవైపు గోస్తాని డ్రైన్‌ పరీవాహక ప్రాంతంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. దీంతో పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కరిసిన ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతుందని అయినా శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని కోరుతున్నారు.

Category

🗞
News
Transcript
00:00Music
00:03Music
00:04Music
00:04Music
00:11Music
00:18Music
00:18Music
00:18Music
00:18Music
00:18Music
00:18Music
00:29Music
00:29Music
00:29Music
00:29Music
00:29Music
00:29Music
00:58Transcription by CastingWords
01:15Transcription by CastingWords
Comments

Recommended