Skip to playerSkip to main content
  • 19 hours ago
Cyclone Effect In Anakapalle : బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తుపాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రేవు పోలవరం, పెంటకోట, పాలమాన్‌పేట తీరాలను భారీ అలలు తాకుతుండటంతో తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాతావరణ పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో, ప్రజలను కాపాడేందుకు, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం, మెరైన్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.  మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు తమ పడవలను ఒడ్డున భద్రపరిచి ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ అలల ధాటికి పడవలు కొట్టుకుపోకుండా లేదా దెబ్బతినకుండా ఉండేందుకు, మెరైన్ పోలీసులు ట్రాక్టర్ల సహాయంతో పెంటకోట తీరం నుంచి సురక్షితమైన, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు తీరప్రాంతాల్లోని ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న అధికారులు, సముద్రం మరింత ఉధృతమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00What
00:57So, let's go.

Recommended