Skip to playerSkip to main content
  • 10 minutes ago
Special Attention to Maintaining Sanitation in Kakinada: అర్నబ్‌ తుపాను విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాకినాడలో పారిశుద్ధ్య నిర్వహణపై కార్పొరేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షం, ఈదురు గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. వాటి తొలగింపులో యంత్రాంగం నిమగ్నమైంది. ఒకవైపు విద్యుత్ కష్టాలు మరోవైపు పారిశుద్ధ్య సమస్యలు తుపాను తర్వాత నగరంలో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. బలమైన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలడం, తీగలు తెగిపడడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిని అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం మరమ్మతులు చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లలో విద్యుత్ లేకపోవడంతో తాగునీటి సరఫరా, రోజువారీ అవసరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేపటికి నగరంలోని అన్ని ప్రాంతాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని కాకినాడ నగరపాలక కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:55Thank you very much.
01:01Thank you very much.

Recommended