Skip to playerSkip to main content
  • 4 months ago
Subramanyeswara Swamy Temple 20 Rupee Note Incident: అత్తకోడళ్ల గొడవలు సర్వసాధారణం. మాటా మాటా అనుకోవడం, గొడవలు పడటం, ఇలా నిత్యం ఒకరు చేసే పనులను మరొరు విమర్శించుకుంటూ ఉంటారు. కానీ అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు పరిధిలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలేం జరిగిందంటే. వైరల్​: పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అధికారులు హుండీ లెక్కించగా అందులో ఒక ఇరవై రూపాయల నోటు కనిపించింది. అయితే దాని మీద ' స్వామి మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామి' అని రెండు వైపులా రాసి ఉంది. హుండీ డబ్బులు లెక్కిస్తుండగా ఈ నోటు కనిపించింది. దానిపైన రాసింది చూసి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇప్పడు ఇదే నోటు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇలాంటిది ఇప్పుడే చూస్తాం ఇలా ఎవరైనా చేస్తారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. కోడలి అమాయకత్వం చూసి పలువురు నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వింత ఘటన సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Category

🗞
News
Transcript
00:28Transcription by CastingWords
00:58Transcription by CastingWords
01:06Transcription by CastingWords

Recommended