Minister Savita Talk with Byker Mother About Helmet : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్రాణం ధరించడం అలవాటు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హితవు పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో 37వ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా స్థానిక వై జంక్షన్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి కరుణాసాగర్తో కలిసి ద్విచక్ర వాహనంపై మంత్రి సవిత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్ అందజేశారు. సోమందేపల్లికి చెందిన సాయి అనే యువకుడు రూ.2.5 లక్షలతో నూతన ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తుండటంతో మంత్రి సవిత ఆ యువకుడి తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు. పిల్లలకు వాహనం కొనివ్వగానే బాధ్యత తీరిపోదని, వారికి హెల్మెట్ ధరించడం అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని మంత్రి సవిత సూచించారు.
Comments