Telugu States Chief Ministers in Ramoji Excellence Awards Ceremony : రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదాన వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. వారు ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రముఖుల దృష్టి అంతా ముఖ్యమంత్రుల మీదే ఉంది. వారు మాట్లాడుకుంటూ నవ్వులు చిందించడంతో ఆ వీడియోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మొదట తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి క్రమక్రమంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు, 2014, 2024లో కలుపుకుని మొత్తంగా నాలుగు సార్లు సీఎం పదవిని చేపట్టారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగింది. ఈ సందర్భంగా దివంగత రామోజీరావు చేసిన సేవలను ప్రముఖులు కొనియాడారు.
Be the first to comment