Different Birthday Wish To Ramoji Rao : మీడియా దిగ్గజం, పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు జయంతి సందర్భంగా ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకుపై ఆయన చిత్రాన్ని గీసి శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు సంస్థల ద్వారా సమాజంపై అపూర్వ ప్రభావం చూపిన మహనీయుడని, వ్యాపారాల్లో సైతం సత్తా చాటాడని కొనియాడారు.దేశ ప్రగతి, ప్రజల ఉన్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామోజీరావు. సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన విజయమని ఆయన బలంగా నమ్మారు. ఇతరుల్లో స్ఫూర్తి నింపడం, అవకాశాలు సృష్టించడం, ప్రతి రంగంలో శ్రేష్ఠతను ప్రోత్సహించడం ఆయన ఆదర్శాలు. క్రమశిక్షణ, సంకల్పం, దేశ సేవ ఈ మూడు మంత్రాలు తరతరాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని దేశ సమగ్రత, ఆలోచనలో ధైర్యం, సామాజిక శ్రేయస్సు పట్ల అచంచలమైన నిబద్ధత, విలువలను కలిగి ఉన్న వ్యక్తులను గుర్తించాలనే సంకల్పంతో నేడు రామోజీ ఎక్స్లెన్స్-2025 అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
Be the first to comment