Bears Halchal In Srikakulam : దేవుణ్ని దర్శించుకునేందకు వెళ్లిన వారికి గుడిలో గుండే పగిలేలా ఓ దృశ్యం ఎదురైంది. ఆలయం లోపలికి ఇలా వెళ్లగానే ఎలుగు బంటులు హల్‌చల్ చేస్తూ కనిపించాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురంలోని శివాలయంలో జరిగింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా స్థానికంగా ఉండేవారు తెల్లవారుజామున శివుణ్ని దర్శించుకునేందుకు వెళ్లారు. లోపలికి ఇలా వెళ్లారో లేదో 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. అలా అవి సంచరించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంట్లు అటూ ఇటూ తిరుగుతూ కాసేపు అలజడి సృష్టించాయి. దీంతో స్థానికులు కర్రలతో బెదిరించారు. కాసేపటికి ఎలుగుబంట్లు సమీపంలోని తోటల్లోకి వెళ్లడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Be the first to comment