Eenadu 50 years celebrations : తెలుగు ప్రజల చైతన్య దీప్తి ఈనాడు స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో 'ఈనాడు' కుటుంబ సభ్యుల సమక్షంలో 50 వసంతాల పండుగను నిరాడంబరంగా నిర్వహించారు. 'ఈనాడు'లో ప్రతి ఒక్కరూ, గడిచిన అర్థ శతాబ్దంలో సాధించిన ఘనత, ఎదురైన సవాళ్లు, అధిగమించిన ప్రతికూల అంశాలు గుర్తు చేసుకున్నారు. దివంగత ఛైర్మన్ రామోజీరావు చూపిన మార్గంలో రాబోయే శతాబ్దానికి సరిపడా ప్రణాళికలతో ముందుకు సాగాలని దీక్షబూనారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా, నవతరానికి దిక్సూచిలా నిలవాలన్న 'ఈనాడు' ఎండీ కిరణ్ ఆకాంక్షను 'ఈనాడు' సైన్యం ముక్తకంఠంతో సమర్థించింది.
Be the first to comment