Indian Youth Following Dink Lifestyle : పెళ్లికి ఆసక్తి చూపని వారే కాదు పెళ్లైనా పిల్లల్ని కనడానికీ సంకోచిస్తున్న వారూ లేకపోలేదు. భార్యభర్తలిద్దరం సంపాదిస్తాం హాయిగా జీవిస్తాం కానీ, పిల్లలు మాకొద్దు అనే వారూ ఉన్నారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. పిల్లలు అంటే చాలు అదనపు ఖర్చు కింద ఆర్థిక భారంగా భావిస్తున్నారు. ఇదో ట్రెండ్‌గానూ మారింది. దాన్నే డింక్ కల్చర్ అంటే డ్యూయల్ ఇన్‌కం నో చిల్డ్రన్స్ అని గర్వంగా చెబుతున్నారు. నిజానికి ఒకప్పుడు ఇంటి నిండా పిల్లలుంటే అదో సంబరం. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకున్నారు. అనంతరం అది ఒకరికి పడిపోయింది. ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దంటున్నారు.
Be the first to comment