Eenadu Golden Jubilee Celebrations : ప్రతీ 30 ఏళ్లకు సమాజంలో తరం మారుతుంది. వాళ్ల తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు! ప్రతీ జనరేషన్‌లోనూ కొత్త ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్లను టార్చ్ బేరర్ అంటారు.! తెలుగు పత్రికా ప్రపంచంలో ఆ టార్చ్ బేరరే 'ఈనాడు'.! కాలానుగుణంగా కొత్తదనం అద్దుకుని, నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం 'ఈనాడు'.! నాలుగున్నర వేల సర్క్యులేషన్‌తో ప్రస్థానాన్ని ప్రారంభించి, 13 లక్షలకు పైగా సర్క్యులేషన్‌తో నంబర్ 1 తెలుగు దినపత్రికగా శిఖరాగ్రంపై సగర్వంగా స్థిరపడిపోయింది. ఈ నెల 10తో 50 ఏళ్ల అక్షర యాత్ర పూర్తి చేసుకుంటున్న ఈనాడు, ఆనాడు ఎలా పుట్టింది? ఏపీలోని విశాఖ సాగర తీరంలో చిరుజల్లులా మొదలై, సమాచార తుఫాన్ ఎలా సృష్టించిందో ఇప్పుడు చూద్దాం.
Be the first to comment