Eenadu Golden Jubilee Celebrations : తెలుగుజాతి గుండెల్లో ఎదిగి, తెలుగు ప్రజల ఒడిలో ఒదిగి, పాఠకుల మదిలో నిత్యం మెదిలే పత్రిక ఈనాడు! 50 ఏళ్లుగా ఆదరాభిమానాలు కురిపిస్తున్న తెలుగువారి ప్రయోజనాల కోసం, అవిశ్రాంతంగా పోరాడింది ఈనాడు! తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపింది. తరచూ ముఖ్యమంత్రుల్ని మార్చే దిల్లీ పెద్దల దుస్సంప్రదాయాన్ని ఈనాడు దునుమాడింది! నాటి ముఖ్యమంత్రులకు జరిగిన అవమానాలపై, తెలుగు జాతిలో పౌరుషాగ్ని రగిలించింది. రాజ్యాంగ విరుద్ధంగా ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేస్తే ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం నడిపించింది. అందుకే ఈనాడు పత్రిక తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక!
Be the first to comment