Skip to playerSkip to main content
  • 2 years ago
Railway travel Insurance Complete Details. Railways offers travel insurance only for 35 paise per passenger. Only Indian citizens can apply for Railway insurance by using IRCTC website or mobile app | 35 పైసల ప్రీమియంతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను రైల్వే బీమా పేరుతో రైల్వేస్ అందిస్తున్నాయి . 35 పైసల నామమాత్రపు ప్రీమియంతో ఐఆర్‌సీటీసీ ఈ ట్రావెల్ బీమా పాలసీని అందిస్తుంది. ఒడిశా ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రైల్వే బీమా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఇక కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఉదంతం తరువాత ప్రయాణికులు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను రిజిస్టర్ చేసుకుంటోన్నారు కూడా. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బీమా రక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారతీయ పౌరులు మాత్రమే దీనికి అర్హులు. 10 లక్షల రూపాయలను అందజేసే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందాలనుకునే ప్రయాణికులు- రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకుంటున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.కొన్ని బీమా కంపెనీల నుండి నేరుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ అందుతుంది. రిజిస్టర్డ్ ఇమెయిల్‌కు పాలసీ సమాచారాన్ని బీమా కంపెనీలు పంపిస్తాయి.నామినేషన్ వివరాలను పూరించడానికి అవసరమైన లింక్ కూడా అదే ఎస్ఎంఎస్‌లో ఉంటుంది.ఏసీ, నాన్ ఏసీ తరగతులతో సహా రైలు ప్రయాణికులందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది.


#RailwaytravelInsurance #Odishatrainnews #Odisharail #AshwiniVaishnaw #RescueOperations #Balasore #NDRF #pmmodi #apcmjagan #CoromandelExpress #train #balasore
#Indianrailways #odisha #odishanews #BahanagaRailwayStation
#Coromandel


~PR.41~PR.38~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended