Baahubali The Epic: Rajamouli revealed that “Baahubali: The Eternal War” will be a ₹120 crore 3D animated epic, expanding the Baahubali Universe beyond imagination! Fans are super excited as the Eternal War teaser will be played during the interval of Baahubali: The Epic re-release.
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ చిత్రాలు రెండూ ఒకే సినిమాగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ టైటిల్‌తో అక్టోబర్ 31న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దాదాపు ఐదున్నర గంటల నిడివి ఉన్న రెండు పార్ట్స్ ని కలిపి, 3 గంటల 43 నిమిషాల సినిమాగా ఎడిటింగ్ చేసి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ‘బాహుబలి 3’పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.బాహుబలి’ ఫ్రాంచైజీలో పార్ట్-3 కూడా ఉందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సైతం గతంలో 'బాహుబలి 3' ఉంటుందనే విషయం చెప్పారు. ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ ఎండింగ్ లో 'బాహుబలి 3' అనౌన్స్ మెంట్ ఉంటుందని, టీజర్ కూడా ప్రదర్శిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజమౌళి స్పందించారు. ప్రభాస్, రానాలతో కలిసి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’పై కీలక అప్డేట్ ఇచ్చారు.రాజమౌళి మాట్లాడుతూ.. ''బాహుబలి: ది ఎపిక్ లో సర్ప్రైజ్ ఉండబోతోందని జనాలు అనుకుంటున్నారు. 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' టీజర్ వస్తుందని, అది 'బాహుబలి 3' అనౌన్స్ మెంట్ అని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అది 'బాహుబలి 3' గురించి కాదు. కానీ బాహుబలి వరల్డ్ కి కొనసాగింపుగా ఉంటుంది. ఇదొక యానిమేషన్ ఫిలిం.
Be the first to comment