Skip to playerSkip to main content
మొంథా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 17 శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం ప్రాథమిక అంచనాల ప్రకారమే నివేదిక సమర్పించామని, పూర్తి స్థాయిలో వివరాలు వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రానికి తక్షణ ఆర్ధిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలోని 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడింది. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది. 4,794 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రహదారులు, 311 కల్వర్టులు-బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. ఈ నష్టం రూ.2,774 కోట్ల మేర ఉందని వివరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని... దీంతో రూ.829 కోట్ల వరకు రైతులు నష్టపోయినట్టు నివేదిక చెబుతోంది. మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం చూపించింది. 12,215 హెక్టార్లలోని రూ.40 కోట్ల విలువైన ఉద్యానపంటలు దెబ్బతినగా 23,979 మంది ఉద్యాన రైతులకు నష్టం జరిగింది. ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. మరోవైపు 2,261 పశు సంపదను నష్టపోయారు


The government has requested urgent financial assistance from the Centre to support the affected regions.
📍 Cyclone Montha impacted 1,434 villages and 48 towns across 249 mandals, with 161 mandals recording heavy rainfall.
🚧 Roads and bridges suffered major damage — 4,794 km of R&B roads and 311 bridges/culverts were affected, causing losses worth ₹2,774 crore.
🌾 In agriculture, 1.38 lakh hectares of crops were damaged, resulting in ₹829 crore loss to 1.74 lakh farmers.
🍊 Horticulture crops over 12,215 hectares worth ₹40 crore were damaged, affecting 23,979 farmers.
🐟 In aquaculture, losses reached ₹514 crore over 32,000 acres, while 2,261 livestock were lost.

This OneIndia Telugu special report highlights the extensive destruction and the urgent need for relief in Andhra Pradesh

#CycloneMontha #AndhraPradesh #APWeather #DisasterReport #OneIndiaTelugu #AndhraPradeshNews #CycloneDamage #FarmersLoss #AndhraRains #NaturalDisaster


Also Read

వరంగల్ కు వరద ఇందుకే.. ఈ పాపం వాళ్ళదే! :: https://telugu.oneindia.com/news/telangana/big-reasons-behind-warangal-floods-here-is-full-details-458315.html?ref=DMDesc

తుఫాన్‌పై జగన్‌కు మాట్లాడే అర్హత లేదు: మంత్రి గొట్టిపాటి కౌంటర్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/no-authority-for-jagan-to-comment-on-cyclone-minister-gottipati-ravikumar-counter-458295.html?ref=DMDesc

ఆ రైతుల ఖాతాల్లో వెంటనే ఎకరాకు రూ 10 వేలు - ప్రభుత్వం ప్రకటన..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-announces-rs-10-000-per-acre-as-compensation-for-crop-damage-458255.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:30Thank you very much.
01:00Thank you very much.
Be the first to comment
Add your comment

Recommended