Skip to playerSkip to main content
  • 5 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : A.P. Mythili : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS :

ఉడిపి కన్నయ్యా

"పల్లవి" : ఉడిపి కన్నయ్యా! గోపాల బాల కృష్ణయ్యా!
నిను ఉడుతా భక్తిగ గొలచిన ఉద్దండుల జేతువయా! "ఉడిపి"

"చరణం" : వేణుగానలోలుడవు బృందావనమాలినీవు
ముద్దులొలుకు బాలుడిగా గోచరించుతావయ్యా
పదునాల్గు భువనములు నీ నోట జూపినావుగా
నీ పదద్వయమే భువనమును పరము జేసెగా "ఉడిపి"

"చరణం": వెన్న చోరుడవు ఘనుడవు మన్ను మీది దేవుడవు!
మనసుల గెలిచేవు బహు మాయల దొంగవు నీవు
బృందావనమున నీవే, ఆత్మబంధువై నిలచావే!
అందాల గోపెమ్మల ముద్దుల కృష్ణుడువే! "ఉడిపి"

"చరణం": చిరుగాలుల సవ్వడి నీ చిరునగవులనుకొందుము
చిరువానల చప్పుడులే నీ చిలుకపలుకులనుకొందుము
మెరుపు కాంతులే నీ కళల మోముఅనుకొందుము
వురుముల సవ్వడులే నీ యానతులనుకొందుము "ఉడిపి"

Category

🎵
Music
Be the first to comment
Add your comment