"పల్లవి" : మీ సంతోషమే నాకు సంతసము మీకును నాకును గలదు విడదీయరాని బంధము "2"
“చరణం" : తల్లి వడిలోని బిడ్డలవలె నాకు, మీరు లాలించే తల్లి నేను నా లోకమే మీరు దండించే మనసులో ప్రేమఅనే యేరుపారు బంధముతో మనసునే చుట్టి వేయు మేరుతీరు "మీ"
"చరణం" : మీ ఉన్నతి గోరులే నా మనంబు ఎన్నడును శిష్టులు దుష్టులను బేధమేల కానగలను సామ దాన బేధ దండోపాయముల నేను మీ బాగోగులనే గోరు, కలవర పడుదు నిరతము నేను "మీ"
"చరణం" : దేవ దేవుని వినతిని వినుమా! మానవా! ఓ సుమతీ! పొందవలె నీవు ఎనలేని సద్గతి మతిమాలి విడువకుమా నీవు దేవుని జతి మరువకుము మనమందరము ఆ దేవుని సంతతి "మీ"
Be the first to comment