"చరణం" : నీ బోసినవ్వులు నను మైమరపించే ఆకలిదప్పులు గురుతు సేయబోవులే! నీ కిలకిలల అమృతమే నా దప్పికను దీర్చునులే! నీ పలుకుల పరమాన్నం నాకడుపును నింపునులే "నా మనసే"
"చరణం" : నీ అడుగు తడబాటే నను సరిజేయునులే! నీ వురుకు పరుగులే నా యోచనలే! నీ లేత జేవేళు అర్చింప చిహ్నములే! “2” నీ పవళింపు స్థానమే నా వైకుంఠధామమే "నా మనసే"
"చరణం" : నీ తొలిఅడుగు ఆకాశమంత ఆనందం నీ మలిఅడుగు పుడమియే పులకితము నీ అడుగులా నా అడుగు ఆనందం “2” ఆనందనందనా! నా ప్రతిఅడుగు నీ మయమే "నా మనసే"
Be the first to comment