"పల్లవి" : అత్తి వరదరాజస్వామి పెరుమాళ్ళు వందనం, నీవు ఉత్తుత్తిగ యీయవుగా లెక్కకు మించిన వరములు "2"
"అ.ప." : ఒత్తి ఒత్తి పలికిన నీ నామ మహిమ గరిమను పత్తిత్తులకైననూ వారి పంట పండును "అత్తి"
"చరణం" : సత్యము నీవు గాక యింకెవరున్నారు! నిత్యము నీ మహిమలు మనసారా గాతుము! నిత్య సత్యములు నీవు పంచిన, పరమాన్నముగా! అసత్య భాషణముల స్వామి సంతృప్తి చెందవుగా! "అత్తి"
"చరణం" : అత్తి వృక్ష రాజమే నీ ఆకారము దాల్చెనుగా! అత్తి వృక్షమే యిల ఘన పూజలందుకొనెనుగా! స్థలాభోగ శిలాభోగ మైనను నీ మహిమేగా! స్థల శిలా భోగముల నెలవుందువు నీవేగా! "అత్తి"
Be the first to comment