Skip to playerSkip to main content
  • 5 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : V. Sadasiva Sarma : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : బంగారు పాదాల

"పల్లవి" : బంగారు పాదాల పాద పద్మారాధన
శృంగార రాయనికి స్వర్ణ పుష్పార్చన "2"

"చరణం" : అంగరంగ వైభవాల సహస్రనామార్చన
రంగురంగు సంర్రంభాల స్వరార్చ నామాల “2”
రంగనాయకునకు అల బ్రహ్మదేవుని
రంగారు సింగారాల బంగారు అర్చన "బంగారు"

"చరణం" : అంగ అంగాంగ శోభ బహు యింపారు శోభ
ఘన సారంగపాణికి సౌమ్యమైన శోభ
సురాంగణల గానాల సుస్వరాల శోభ
సురలోక నాయకునకు సుప్రభాత శోభ "బంగారు"

"చరణం" : అభ్యంగ స్నానాల అసమాన సమావర్త
అభిజిత్ ముహూర్తాన అందుకోవా మా జోత “2”
అచ్చెరువొందే సేవల కొండల కోనేటిరాయా!
సచ్చరితుల పాలి నీవు సత్యదేవుడవయ్యా! "బంగారు"

Category

🎵
Music
Be the first to comment
Add your comment