అ.ప." : నీ కన్నుల కాంతిలోన పయనించే వారలము నీ గాలిసోకిన మనసు ఆనంద పరవశము "ఆనందం"
"చరణం" : నీ కొండలపైన పాదం నే మోపగనే నా అండ నీవనే భావమే గల్గెనులే! (భావనయే) నా గుండె సవ్వడియే గుడిగంట ఆయనులే! “2” నా డెందము పులకితయై నవ నవోదయమాయెనులే! "ఆనందం"
"చరణం" : నవోదయపు అరుణిమయె తిరునామమై మెరసెనులే! నీ సుందర రూపమే నా హృదిలోన నిలచెనులే! అందమైన అనుభూతియె ఆనంద నిలయమాయెనులే! ఆనందనిలయమే తిరువేంకటపురమాయెనులే! "ఆనందం"
Be the first to comment