"పల్లవి" : ఆరోగ్యము ఆనందము అర్కుని మరి సేవించిన ఆయుషు, ఐశ్వర్యం అర్కుని మరి అర్చించిన "2"
"చరణం" : ఏడు అశ్వములపై విహరించే భాస్కరుడు ఏడు లోకాలలో విహరించే ప్రభాకరుడు ఏడు నదుల సంగమము కలిగించు ఆదిత్యుడు ఏడవ తిధిలో మరి విహరించే దినకరుడు "ఆరోగ్యము"
"చరణం" : దినకరుడు లేనిదే సృష్టి అసలు లేదులే! సృష్టి లేనిదే మనము మనమను వారము కాములే!! సృష్టి కారకుడు యీ సూర్యభగవానుడైతే! స్థితి కారకుడు ఆ శ్రీమన్నారయణుడే "ఆరోగ్యము"
Be the first to comment