Neelimeghapuchaaya - Kanakesh Rathod

  • 3 years ago
Sudhanva Sankirtanam : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music : Kanakesh Rathod : Singer : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Founation.

LYRICS : నీలిమేఘపుఛాయ

పల్లవి : నీలిమేఘపుఛాయనీలోత్పలుడు
నీలిఆకసమంతా అడుగైనఱేడు [2]

అ.ప: నందగోకులమున నేరేడుపండు
నందబాలుడెవాడు నారాయణుడు [నీలి]

చరణం: తెల్లనిఛాయగల క్షీరసాగరమున
కర్పూరపుపండు కమలనాధుడెవాడు [2]
పీతాంబరములొ కాంతులీనెడువాడు
దామోదరుడు దేశిమామిడిపండు [నీలి]

చరణం : ముత్యపుబారుల పలువరుసవాడు
నొక్కుకేశముల పసిపనసయెవాడు [2]
సిరిని వక్షమున నిలిపిన ఱేడు
భూసురపక్షమున నిలిచినవాడు [నీలి]

చరణం : విశ్వమంతటయున్న ముంతమామిడిపండు
మధురామృతతొనల కమలాఫలమెవాడు [2]
బ్రహ్మను నాభిన సృష్టించిన ఫలము
బ్రహ్మండములలోన నారికేళమేవాడు [నీలి]

చరణం : అన్నిఫలములలోనూ యున్నదితానే
మిన్నఫలములనే అందించునుతానే [2]
పదునాల్గుభువనముల పగడమైవెలుగొందు
పదసోపానమున పుష్యరాగమైనాడు [నీలి]