Angaranga Vaibhavam

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singers : A.P. Mythili : V. Sadasiva Sarma : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : అంగ రంగ వైభవం

"పల్లవి" : అంగ రంగ వైభవం రంగనాధునీ ఉత్సవం "2" "శ్రీ"
జగమంతా వీక్షణం మనసంతా వుత్సాహం "2" "అంగ"

"చరణం" : ఏడురోజులు సాగే ఘనమైన వుత్సవం
ఏడేడు లోకములు వీక్షించే సంబరం “2”
ఏడేడు జన్మలు ముక్తినొసగు సంరంభం
ఏడుకాలాలు తిరముండు వుత్సవం "అంగ"

"చరణం" : ఆనందం అద్భుతము మిళితమీ వుత్సవం
రంగనాధోత్సవం యిల బంగారు వుత్సవం
స్వర్గమే యిలపైన దిగునటుల వుత్సవం
కలనైనను కనివినీ ఎరుగనీ వుత్సాహం, ఆశ్ఛర్యం "అంగ"

"చరణం" : ప్రతిమాఘమున జరుగును రంగని బ్రహ్మోత్సవం
ఆఘమేఘములపైన జనులు తరలు వుత్సవం
రంగనాధుడే మేఘము జనుల మనసు క్షేత్రము
కను జూపే జల్లు మనకు మోక్షమే విత్తనము "అంగ"

Recommended