Skip to playerSkip to main contentSkip to footer
  • 5/15/2020
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : GIRIJA RAMANA

పల్లవి : గిరిజా రమణ, సుందర చరణ, హర ఓం నమః శివాయ
సంకట హరణ, సన్నుత చరణ, శివ ఓం నమః శివాయ
రూపం నమః శివాయ, పూజ్యం నమః శివాయ,
పాదం నమః శివాయ, ధన్యం నమః శివాయ "గిరిజా"

చరణం : దక్ష ప్రజాపతి దర్పము బాపిన, హర ఓం నమఃశివాయ
వీరబధ్రునిగ సుయజ్ఞ నాశము చేసిన నమఃశివాయ
గమ్యం నమఃశివాయ, నాట్యం నమఃశివాయ,
గానం నమఃశివాయ; నామం నమఃశివాయ,
క్షీరమధనమున గరళము మ్రింగి హర ఓం నమఃశివాయ
ముల్లోకములను కాచి, బ్రోచిన శివ ఓం నమఃశివాయ
భావం నమఃశివాయ, భజనం నమఃశివాయ,
స్తోత్రం నమఃశివాయ, శ్రావ్యం నమః శివాయ "గిరిజా"


చరణం : శివతాండవమున లోకములన్నియు, హర ఓం నమఃశివాయ
సత్యానందమె పొందెను, దేవర! శివ ఓం నమఃశివాయ
ధమరుక నమః శివాయ, ప్రమధం నమఃశివాయ
అమరం నమః శివాయ, అజేయం నమఃశివాయ
బ్రహ్మ, విష్ణు నుత, అసుర సేవిత హర ఓం నమఃశివాయ
జగతి అంతయూ కైలాసమె కద! శివ ఓం నమఃశివాయ
ధర్మం నమఃశివాయ, దైవం నమఃశివాయ
సత్యం నమఃశివాయ, నిత్యం నమఃశివాయ "గిరిజా"

చరణం : జగదంబను నీ అర్ధభాగమున హర ఓం నమఃశివాయ
నిలిపి బంధమును చాటిన తండ్రీ, శివ ఓం నమఃశివాయ
బంధం నమఃశివాయ, రమ్యం నమఃశివాయ
భవ్యం నమఃశివాయ, భవితం, నమఃశివాయ
సామవేదమున నిత్యము కొలువై, హర ఓం నమఃశివాయ
వేద సారమై వెలుగొందేవు శివ ఓం నమఃశివాయ;
నాదం నమఃశివాయ, వేదం నమఃశివాయ
సర్వం నమఃశివాయ, శివోహం నమఃశివాయ, "గిరిజా"

Category

🎵
Music