Skip to playerSkip to main contentSkip to footer
  • 5/13/2020
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

GAM GAM GANAPATHIM

పల్లవి : గం గం గణపతిం, గజాననం గణపతిం "2"
గం గం గణపతిం, వినాయకం గణపతిం "2"

చరణం : మూషిక వాహనమెక్కి, లోకాలు దిరిగేవు
ఇక్కట్లు కడతేర్చి, కోరికలు దీర్చేవు
చవితి దినమునాడు ఉండ్రాళ్ళను భుజియించి
కొండంత ఫలములను, అందింతువయ్యా "గంగం"
గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "4"

చరణం : ఏకదంతా! నిను పలువిధముల తలతుమయా!
పార్వతి తనయా! మమ్ము గాపాడవయా!
పసిమనసుల కోర్కెలను, నెరవేర్చవయా!
వారి చదువుసంధ్యలందు నిలువుమయా!
జ్ఞాన, విజ్ఞానమను, దీపము వెలిగించవయా
అజ్ఞానమనే తిమిరము పారద్రోలి కావుమయా!
లక్ష్యములొ, నీవు లక్షణుడవై
విజయ భేరి, మ్రోగించగ రావయా! "2"
గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "గంగం" "4"

చరణం : "యద్భావం తద్భవతని" గొలుతమయా!
జిష్ణువైన, విష్ణువైన నీవెనయా!
ముల్లోకపు ఏకదైవము నీవెనయా!
తొలిపూజలు గైకొందువు రావయా!
నీ"నిమజ్జనము"లోని పరమార్ధము దెలిపితివి
"భక్తిమునక" కల్మషమును, కడిగివేయునంటివి
సజ్జన సాంగత్యము మేలంటివి
వారిని ఎన్నడు వీడొద్దంటివి "2"
గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "గంగం" "4"

Category

🎵
Music