Esumantha - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : ESUMANTHA

పల్లవి : ఇసుమంత తలచిన, ఎంతటి భాగ్యము
ఇంతటి దైవము, ఎంతైనను, కనలేము "2"

అ.ప. : అంతట తానైన, ఆది బ్రహ్మ రూపము
కొంత తలచినను ,అందించును మరి ఘనము "ఇసుమంత"

చరణం : ఎంత వెదకిన , కానగ దుర్లభమైనను
వెదకిన తావుల వెదకితి "2"
తెలుసుకొంటిని, జగతి యంతయు వ్యాపించిన విభుని "2"
నగధరుడేయని, గోవిందుడేయని "ఇసుమంత"

చరణం : "సుంత" యును లేడను వారి దర్పముల
నంతయు, జగమంత నిండె, జగన్నాధుడు "2"
"ఎంతో" అయిన హరిని, ఇంతయని , వర్ణింప సాధ్యమా! "2"
సిరి వరుడే యని, శ్రీ శ్రీనివాసుడని "ఇసుమంత"