AB de Villiers helped Royal Challengers Bangalore to defeat Kings XI Punjab by 17 runs here at the M Chinnaswamy Stadium on Wednesday. #IPL2019 #rcbvskxip #RoyalChallengersBangalore #KingsXIPunjab #ABdeVilliers #viratkohli #marcusstoinis #chrisgayle #klrahul #cricket
ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 185 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కేఎల్ రాహుల్ 27 బంతుల్లో42 (7 ఫోర్లు, ఒక సిక్స్), క్రిస్ గేల్ 10 బంతుల్లో 23(4 ఫోర్లు, ఒక సిక్స్) పంజాబ్‌కు చక్కటి శుభారంభం ఇచ్చారు.
Be the first to comment