Minutes after a glaring umpiring oversight allowed Mumbai Indians (MI) to beat Royal Challengers Bangalore (RCB) by 6 runs in match 7 of the Indian Premier League (IPL) on Thursday, home captain Virat Kohli reportedly stormed into the match referee’s chamber and Argue with the official over the poor standard of officiating. #ipl2019 #rcbvsmi #mumbaiindians #royalchallengersbangalore #viratkohli #Referee #manunayar #rohitsharma #lasithmalinga #Umpires
ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో బెంగళూరు విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవగా.. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ నోబాల్ విసిరిన సంగతి తెలిసిందే.మలింగ నోబాల్‌గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లీ.. ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. ప్రజంటేషన్ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Be the first to comment